జిల్లాలో ఎంపిక చేసిన 710 పాఠశాలల్లో యు డైస్ పై ఈనెల 15 నుంచి 21 తేదీ వరకు తనిఖీలు జరుగుతాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటనలో తెలిపారు. తనిఖీలు చేసేందుకు మెదక్ డైట్ కళాశాలకు చెందిన 56 మంది డిఈడి విద్యార్థులను నియమించినట్లు చెప్పారు. ఇప్పటికే వీరికి దీనిపై శిక్షణ కార్యక్రమాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.