అందుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అందులో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని చెప్పారు. వీరి కోసం ప్రత్యేకంగా స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజారాణి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.