సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేట మండలం మక్త లక్ష్మపూర్ గ్రామానికి చెందిన బోయిని చంద్రమోహన్ కూతురు అశ్విని (6) ప్రైవేటు పాఠశాల స్కూల్ బస్సు ఢీకొని మరణించింది. విషయం తెలుసుకున్న పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ గురువారం లక్మపూర్ గ్రామంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని చిన్నారి అశ్విని భౌతిక దేహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు.