

పెళ్లి కారును ఢీకొట్టిన లారీ.. వరుడికి గాయాలు (వీడియో)
AP: ఏలూరు జిల్లా ఉంగుటూరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నాచుగుంట వద్ద పెళ్లి కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడితో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.