నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని పలు మురికి కాలువలు చిన్నపాటి వర్షానికే నీటితో నిండి రోడ్ల పైకి ప్రవహిస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుధ్యం పడకేస్తుంది. ప్రజలు రోడ్లపై నడవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్చదనం పేరుతో కేవలం పత్రిక ప్రకటనలకే పరిమితం అయ్యారు. బుడగజంగాల కాలనీ నుండి వెళ్లేదారిలో మురికి కాలువ నీటితో నిండి ప్రమాదకరంగా మారింది.