
ఏసీబీ కోర్టుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి
ఏపీ లిక్కర్ స్కాం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి (ఏ31), ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి (ఏ32)లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏసీబీ కోర్టులో జడ్జి ముందు శనివారం హాజరుపరిచారు. లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు ఏడుగురిని సీఐడీ అరెస్టు చేసింది. ఈ కేసులో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు.