నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలం రామ్ రెడ్డి పేట్ గ్రామానికి చెందిన సిహేచ్ పార్వతి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 24, 000 రూపాయల చెక్కును శనివారం మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వారి స్వగృహంలో బాధితులకు అందజేయడం జరిగింది. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ సర్పంచ్ ఈశ్వర్, మాజీ ఎంపీటీసీ సంగప్ప, తదితరులు ఉన్నారు.