సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఘనపూర్ గ్రామానికి చెందిన సుర్నార్ గాయత్రి ఎప్ సెట్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. రాష్ట్రవ్యాప్తంగా 21066 ర్యాంక్ సాధించడంతో ఆమె తల్లిదండ్రులు సుర్నార్ సుదర్శన్ రావు పాటిల్, తారీక బాయి ఆనందంతో ఉప్పొంగి పోయారు. తల్లిదండ్రుల అధ్యాపాకుల ఉత్సాహం, కృషితో మంచి ర్యాంకును సాధించగలరని గాయత్రి తెలిపింది. ఆమెను గ్రామస్తులు అభినందించారు.