సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో శోభాయాత్ర నిర్వహించే సమయంలో ఇతర మతాల వారి మనోభావాలను కించపరిచే నినాదాలు చేయరాదు. నియోజకవర్గం పరిధిలో డీజే లకు అనుమతి లేదు అని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.