కంగ్టి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి సోమవారం ఉదయం 9 గంటలకు పూలమాలవేసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు యూత్ కాంగ్రెస్ నాయకులు అశోక్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన గొప్ప పోరాటం వల్లే ఈరోజు బడుగు బలహీన వర్గాలన్నిటికీ ఒక మార్గం చూపించి ఆయన పోరాటం వల్లే ఈరోజు భారత రాజ్యాంగం తోటి భారతదేశం నడుస్తోందని కొనియాడారు.