వరి ధాన్యం కొనుగోలు కేంద్రము ప్రారంభం

64చూసినవారు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రము ప్రారంభం
నారాయణఖేడ్ మండల పరిధిలోని హనుమంతరావుపేట్ గ్రామంలో గురువారం ఐకెపి కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే మ ప్రభుత్వ ధ్యేయం, రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరను అందిస్తాం. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్