సంగరెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పోచపూర్ లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహకారంతో జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఎంపీపీ మహిపాల్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ, ఎంపీపీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతి పంటకు మద్దతు ధర కల్పించి.. రైతులు సంతోషంగా ఉండాలని ఉద్దేశ్యంతోనే సీఎం
కేసీఆర్ వరి కొంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచొద్దని ఉద్దేశ్యంతో... ప్రతి గింజ తామే కొంటామని సీఎం
కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్షాకాలం జోరుగా సాగడంతో భూగర్భ జలాలు పెరగడం బోర్లు బావులు, చెరువులు, కుంటలు నల్లవాగు ప్రాజెక్టు పూర్తిగా జలకళతో సంతరించుకోవడంతో కాలువల ద్వారా ప్రజలు కొన్ని వేల ఎకరాల వరి పంటను పండించారు. వాటిని కొనడానికి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహకారంతో.. వివిధ గ్రామాలలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కృష్ణమూర్తి, పోచాపూర్ ఎంపీటీసీ రాములు, పోచాపూర్ మాజీ ఎంపీటీసీ కృష్ణ గౌడ్, రైతులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.