ఖేడ్ లో ఘనంగా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు

549చూసినవారు
ఖేడ్ లో ఘనంగా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు
నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావ్ పూలే 188వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో అయన పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల, పేద, దళిత, గిరిజనుల హక్కుల కోసం ఉద్యమించిన మహోన్నత వ్యక్తి పూలే అన్నారు. కుల వివక్షత ఉండరాదని, స్త్రీ, పురుషుల సమానత్వం కోసం పోరాడిన వ్యక్తి పూలే అని అయన చూపిన బాటలో ప్రతిఒక్కరు నడవాలన్నారు. అదేవిధంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్