కల్హేర్: బదిలీ పై వెళ్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు ఆత్మీయ వీడ్కోలు

71చూసినవారు
కల్హేర్: బదిలీ పై వెళ్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు ఆత్మీయ వీడ్కోలు
సంగారెడ్డి జిల్లా కల్హేర్ పోలీస్ స్టేషన్ నుండి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, సంజీవులు హైదరాబాద్ కు బదిలీ పై వెళ్తున్నారని స్థానిక ఎస్సై వెంకటేశం తెలిపారు. బదిలీ పై వెళ్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు శనివారం కల్హేర్ పోలీస్ సిబ్బంది ఘనంగా శాలువా కప్పి పూలమాలతో ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశం, ట్రైనింగ్ ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్