క్రిష్ణాపూర్ మండల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. బాడీడు పిల్లలు అందరూ కూడా నాణ్యమైన విద్యకోసం ప్రభుత్వ పాఠశాలలో చేరిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జి జగన్ మోహన్ రెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుదర్శన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.