కంగ్టి: పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ

81చూసినవారు
కంగ్టి: పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ
కంగ్టి మండల కేంద్రంలో యువ సైన్యం సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక విద్యార్థులతో కలిసి బుధవారం పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ సుభాష్ చంద్రబోస్ చౌక్ నుండి శివాజీ చౌక్ వరకు నిర్వహించారు. బస్వరాజ్, మెండే సంతోష్, లొండే నర్సింలు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులతో పాటు పాఠశాల అధ్యాపకులు సుభాష్, తదితరులు పాల్గొన్నారు.