వసంత పంచమి సందర్భంగా కంగ్టిలోని జ్ఞాన వికాస్ పాఠశాలలో సోమవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. విద్యా దేవత సరస్వతి దేవిని పూజించి, చిన్నారులకు తొలి అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.