కంగ్టి: విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన పట్టించుకోని అధికారులు

75చూసినవారు
కంగ్టి మండలం నుండి తడ్కల్ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన విద్యుత్ తీగలు నేలకొరగడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని సీపీఎం ఏరియా కార్యదర్శి రమేష్ అన్నారు. గురువారం ఆయన కంగ్టి లోని విద్యుత్ తీగల వద్ద మాట్లాడుతూ నాలుగు విద్యుత్ స్తంభాలు రైతుల పొలంలో విరిగిపడడంతో రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్