
కేరళ నర్సు కళలను చెరిపేసిన విమాన ప్రమాదం
ఎయిరిండియా విమాన ప్రమాదంలో 241 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఎందరో కలలు ఈ ప్రమాదం చెరిపేసింది. ఈ ప్రమాదంలో కేరళలోని పతినంతిట్ట జిల్లాలోని తిరువల్లకు చెందిన 39 ఏళ్ల నర్సు రంజిత గోపకుమార్ పెట్టుకున్న ఆశలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. యూకేలోని ఉద్యోగాన్ని వదిలేసి కేరళలో సెటిల్ అవ్వాలనుకున్న రంజిత గురువారం చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు కనెక్టింగ్ ఫ్లైట్‌లో ఎక్కారు. కొంతసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు.