సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎంపీపీఎస్ సిద్దంగర్గ, ఎంపీపీఎస్ ఎన్కెమూరి, ఎంపీపీఎస్ బొజ్జ నాయక్ తండా పాఠశాలలను ఎంఈవో రహీమొద్దీన్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల రికార్డులను విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థుల అభ్యాస అభివృద్ధి వారి నైపుణ్యత పై సమీక్షించారు. ప్రాథమిక విద్యార్థులకు అర్థమయ్యేలా పాటలు బోధించాలని టీచర్లకు అయన సూచించారు.