నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు హన్మంత్ రావ్ కూతురికి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ విషయాన్ని తెలుసుకొని శనివారం గాయపడిన యువతికి కుటుంబ సభ్యులను హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పి అండాగా ఉంటామని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.