భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలోని, కంగ్టి రూట్ లోని అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిఎంఆర్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ వేడుకలు జరుపుకోవడం మన గొప్ప విషయం మన అదృష్టమని అన్నారు.