సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం ఖానాపూర్(కే ) గ్రామానికి చెందిన ఉప్పరి లక్ష్మణ్, కంగ్టి మండల కేంద్రానికి చెందిన ప్రభు ఆరోగ్యంతో హైదరాబాదులోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకొని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి వీరిని పరామర్శించి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.