నారాయణఖేడ్ పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విగ్రహానికి హిందూ సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి మహా హారతి ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.