నారాయణఖేడ్ నియోజకవర్గం మనుర్ మండలం దూదగొండ గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో ఆదివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి భోజనం చేశారు. లబ్ధిదారుల కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం ఎలా ఉన్నాయంటు కుటుంబ సభ్యులను అడిగారు. ధనికులు తినే బియ్యాన్ని పేదలకు అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.