ఎంఐఎం పార్టీ శాసనసభా పక్ష నేత ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని హైదరాబాద్ దారుస్సలాంలోని ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు న్యాయవాది మోహీద్ పటేల్ ఆదివారం కలిశారు. ఈ సమావేశంలో మోహీద్ పటేల్ నారాయణఖేడ్ ప్రజా సమస్యలపై, నారాయణఖేడ్ తాజా రాజకీయ పరిస్థితులపై అక్బరుద్దీన్ ఒవైసీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు షేక్ అంజేద్, మజ్హర్, జబర్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.