సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గంలో గిరిజన గురుకుల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. సావిత్రి బాయి పూలె జయంతి పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ యాదగిరి వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ అరవింద్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.