నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలంలో చలి వణికిస్తోంది. వెచ్చదనం కోసం గ్రామాల్లో జనాలు మంటల వద్ద కూర్చుంటున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయట ఎవరు తిరగడం లేదు. ఉదయం ఏడు గంటల వరకే పత్తి తెంపుడు కొరకు వెళ్లే రైతులు, చలి ఎక్కువగా ఉండటంతో తొమ్మిది దాటే వరకు పొలాల్లోకి వెళ్ళడం లేదు. గత వారం రోజుల నుండి చలి తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలంటున్నారు. చలికి అనేక సీజనల్ వ్యాదులు వస్తున్నాయని బుధవారం ప్రజలు అంటున్నారు.