మనూర్ మండలం దుదిగొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఆదివారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని చెప్పారు. బేస్ మీట్ వరకు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.