కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ. డియస్ తన జీవితం రాజకీయాలకే అంకితం చేశారు అన్నారు. 2004-2009 వరకు ఆయనతో అసెంబ్లీలో మంచి అనుభూతిని పంచుకోవడం జరిగిందని, అయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.