నాగల్ గిద్ద మండలంలోని ఇరాక్‌పల్లి గ్రామంలో శుక్రవారం "ఫ్రైడే డ్రై డే" కార్యక్రమంలో భాగంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, టీవీ వ్యాధులపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ జూవేరియా బేగం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఆరోగ్యంపై చైతన్యం తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు విక్టోరియా రాణి, శాంత, ఆశా కార్యకర్త రమేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.