నాగల్‌గిద్ద: విద్యుత్ వైర్లు తెగి మంటలు

63చూసినవారు
నాగల్‌గిద్ద మండలం ఔదత్పూర్ గ్రామంలో ఆదివారం విద్యుత్ తీగలు తెగిపడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. దీంతో స్థానికంగా మంటలు వ్యాప్తి చెందడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక ట్రాన్స్‌ఫార్మర్‍ వద్ద నాలుగు రోజులుగా తీగలు కిందికి వేళాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. ఉదయం ఆ తీగలు తెగి కిందపడంతో మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్