నారాయణఖేడ్: జూద స్థావరంపై దాడి

78చూసినవారు
నారాయణఖేడ్: జూద స్థావరంపై దాడి
నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మండల పరిధిలోని జగన్నాథ్ పూర్ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం కొందరు జూదం ఆడుతున్నారని పోలీసులకు నమ్మదగిన సమాచారం వచ్చింది. వెంటనే వెళ్లి దాడిచేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు నారాయణఖేడ్ ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి తెలిపారు. జూదరుల నుంచి రూ. 8100 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి వివరించారు.

సంబంధిత పోస్ట్