నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్గిద్ద మండల పరిధిలోని జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు 2025 సందర్భంగా కరస్ గుత్తి చౌరస్తా వద్ద నాగల్గిద్ద ఎస్ఐ సాయిలు మరియు సిబ్బంది తో కలిసి అవేర్నెస్ ప్రొగ్రాం శనివారం నిర్వహించారు. అనంతరం అవేర్నెస్ ప్రొగ్రాంలో భాగం ప్రజలకు పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రవాణా భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు.