నారాయణఖేడ్ పట్టణంలో ఈనెల 30వ తేదీన బసవేశ్వర జయంతి కార్యక్రమాలను విజయవంతం చేద్దామని వీర శైవ లింగాయత్ సమాజ్ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నారాయణఖేడ్ పట్టణంలో బసవేశ్వర జయంతి నిర్వహణ పై సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ కార్యక్రమాలకు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు, సమాజ్ నాయకులు హాజరవుతారని తెలిపారు.