కంగ్జి మండల తహశీల్దార్ ను భీమ్ ఆర్మీ నారాయణఖేడ్ అధ్యక్షులు అనుముల తూకారాం గురువారం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. అనంతరం భీమ్ ఆర్మీ సెక్రటరీ ఉమా సింగ్ మాట్లాడుతూ భూ సమస్యలపై మండల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ కంగ్జి మండల అధ్యక్షుడు గౌతమ్ కృష్ణ సాగర్, తదితరులు పాల్గొన్నారు.