అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి నిర్వహిస్తాం: చంద్రబాబు
AP: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. శనివారం వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుడి వీరగాథను స్మరించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. సిపాయిల తిరుగుబాటుకు ముందు.. 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి వడ్డే ఓబన్న ఆంగ్లేయులతో పోరాడారని గుర్తు చేశారు.