జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని నారాయణఖేడ్ జూనియర్ కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలను శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి ముగ్గుల పోటీలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో అశోక్ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.