నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం ఖానాపూర్ (కే) గ్రామంలో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి సమావేశమై ఈనెల 27 తేదీన వరంగల్ లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ గురించి వారికి ఆదివారం దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పిటిసి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, తదితరులు ఉన్నారు.