సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్గిద్ద మండలం పరిధిలో కారస్ గుత్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం అంబేద్కర్ పూలె సేవా సమితి అధ్యక్షులు రహీమ్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు ను ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేష్ షేట్కార్ ను శాలువాతో సన్మానించారు.