రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మంగళ్ పేటలో డిప్యూటీ తహసిల్దార్ రాజు పటేల్ పర్యవేక్షించారు. ప్రజలు ఇళ్లలో ఉండి ఎన్యుమరేటర్లకు సహకరించాలని అన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టా పాస్ బుక్ అందుబాటులో సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు.