నారాయణఖేడ్: ఎల్వోసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

67చూసినవారు
నారాయణఖేడ్: ఎల్వోసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండలం పోతన్‌పల్లి(ఆర్) గ్రామానికి చెందిన నాయకుని బాలయ్య అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన ఆరోగ్య ఖర్చుల కోసం ఎల్వోసి ద్వారా మంజూరైన రూ.1,50,000 చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసింహరెడ్డి (సీడీసీ మాజీ చైర్మన్) తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్