నారాయణఖేడ్: స్కూల్ మైదానంలో విద్యార్థినిలు వివిధ రకాల రంగులతో ముగ్గులు వేసి శుక్రవారం అలరించారు. విద్యార్థులు గాలిపటాలు ఎగురవేసి ఒకరితో ఒకరు పోటీపడి బహుమతులు గెలుపొందారు. విద్యార్థిని విద్యార్థులకు కరస్పాండెంట్ ఏన్ సిద్ధారెడ్డి బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఏమి జరిగిందో లేదో భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనం నియంత్రించలేము. కానీ, మనం వర్తమానంలో పూర్తి అవగాహనతో జీవించగలమని అన్నారు.