నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో గురువారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు తహశీల్దార్ విష్ణు సాగర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పి లోకేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో భూ భారతి సదస్సు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ చట్టంతో రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.