![](https://media.getlokalapp.com/cache/65/64/65646cbf1dbd483d7f13497c2b53a64d.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
ట్రాఫిక్ పోలీసును చెంపదెబ్బ కొట్టిన ఆటో డ్రైవర్ (వీడియో)
విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఆటో డ్రైవర్ చెంపదెబ్బ కొట్టిన ఘటన అస్సాంలోని డిబ్రూఘర్‌లో ఆదివారం జరిగింది. సైకిల్‌తో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ పోలీసు అధికారిని ఒక ఆటో డ్రైవర్ పలుషిత పదజాలంతో దూషించడమే కాకుండా ఆయనపై చేయిచేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటో డ్రైవర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అస్సాం పోలీసులను కోరడం జరిగింది.