ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీ పై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తున్నందుకే నోరు నోక్కెందుకు కేసు పెట్టినట్లు ఆరోపించారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని పేర్కొన్నారు.