నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీలకు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అలిగే జీవన్ డిమాండ్ చేశారు. నారాయణఖేడ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డిలు చైర్మన్ పీఠం భర్తీ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీలను భర్తీ చేయాలని కోరారు.