నారాయణఖేడ్ మండలం తుర్కాపల్లిలో గురువారం ఐకెపి కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం.. అని రైతు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరను అందిస్తామని రైతులకు అన్ని విధాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు