నారాయణఖేడ్ పట్టణంలోని హనుమాన్ శోభాయాత్రలో భద్రత ఏర్పాటు చేసిన పోలీసులకు భద్రతను కట్టుదిట్టంగా చేసినందుకు మీ కృషి అమోఘమని హిందూ సంఘాల నాయకులు నారాయణఖేడ్ డిఎస్పీ వెంకటరెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై విద్యాచరన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించినందుకు పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.