నిజాంపేట్ మండలంలో ఏర్పాటు చేసిన వానాకాలం (ఖరీఫ్) సీజన్ కు సంబంధించిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రైతులను రాజులు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్ చౌహన్,పండరి రెడ్డి, రాధాకిష్ణ సాయిరెడ్డి, సొసైటీ చైర్మన్ లు ఐకెపి సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.